
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఖమ్మంరూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞు లైన, తర్ఫీదు పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, తద్వారా నాణ్యమైన బోధన అందుతుందని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు, ఎస్‌ఐఈటీ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి అన్నారు. మండలంలోని జలగంగనర్ ఉన్నత పాఠశాలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు నిర్భయంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుంటారని అన్నారు. అనంత రం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశా రు. సాయంత్రం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు ఎం.శ్యాంసన్, సీసీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.