
పగలు ఎండ.. సాయంత్రం వాన !
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలంతా ఎండ కాస్తూ సాయంత్రం వర్షం పడుతోంది. రాత్రి వేళ చల్లదనం ఉంటుండగా, మధ్యాహ్నం ఎండ దంచికొడుతోంది. శుక్రవారం వరకు జిల్లాలో గరిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శనివారం 38 డిగ్రీలకు చేరువైంది. ఖమ్మం ఖానాపురంలో గరిష్టంగా 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బచ్చోడులో 37.3, వైరా ఏఆర్‌ఎస్ వద్ద 37.2, ఖమ్మం ప్రకాష్‌నగర్, తల్లాడల్లో 37.1, మధిర, తిరుమలాయపాలెంలో 37, సత్తుపల్లి ఓసీ, రావినూతల, కుర్నవల్లి, వైరాలో 36.9, పంగిడి, పల్లెగూడెం, మధిర(ఏఆర్‌ఎస్), కల్లూరులో 36.8, రఘునాథపాలెం, ఏన్కూరు, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్, సత్తుపల్లి, కొణిజర్లలో 36.7, నాగులవంచ, కాకరవాయిలో 36.6, మంచుకొండ, పెద్దగోపతి, గేటు కారేపల్లి, కలక్టరేట్‌లో 36.5, పెనుబల్లి, ఎర్రుపాలెం, సిరిపురం, ముదిగొండలో 36.4, చింతకాని, లింగాల, గుబ్బగుర్తిలో 36.2, గంగారం, నేలకొండపల్లి, పమ్మిలో 36.1 వేంసూరులో 35.7, తిమ్మారావుపేటలో 35.5, సదాశివునిపాలెంలో 35.4, కూసుమంచిలో 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సాయంత్రం 6 గంటల నుంచి పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పగటి వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తుండగా ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరికి తెగుళ్లు ఆశిస్తుండగా ఉద్యాన పంటలపైనా ప్రభావం పడుతోంది.
పలు ప్రాంతాల్లో వాన..
పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చింతకానిలో అధికంగా 38.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, సిరిపురంలో 24.5, పెద్దగోపతిలో 15.3, ముదిగొండ, రావినూతలలో 15, కూసుమంచిలో 13.5, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్ వద్ద 10, ఏన్కూరులో 9.8, పల్లెగూడెంలో 7.8, మధిరలో 6.8, ఖమ్మం ఖానాపురంలో 5.8, తిరుమలాయపాలెం, మధిరలో 5, రఘునాథపాలెంలో 4.8, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 4.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
జిల్లాలో భిన్న వాతావరణం