
గేదెల పంపిణీ ప్రారంభం
‘ఇందిరా’ డెయిరీలో ముందడుగు
బోనకల్: మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటులో భాగంగా ముందడుగు పడింది. మహిళలకు రెండేసి పాడిగేదెలు పంపిణీ చేసి పాల సేకరణతో వారి ఆర్థికాభివృద్ధి కోసం డెయిరీని ఏర్పాటుచేస్తున్నారు. ఈమేరకు పలువురు సభ్యులు ఉండగా.. బోనకల్ మండలంలోని వివిధ గ్రామాల్లో తొలి విడతగా 25 మంది లబ్ధిదారులకు 50గేదెలు పంపిణీ చేశారు. అధికారులు, లబ్ధిదారులతో కూడిన కమిటీలు ఏపీలోని ద్రాక్షారామం వెళ్లి అక్కడ వీటిని కొనుగోలు చేశారు. రూ.2లక్షల విలువ కలిగిన యూనిట్‌తో పాటు దాణా సైతం సోమవారం లబ్ధిదారులకు అందజేసినట్లు ఏపీఎం కొట్టె వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.2,100 చెల్లించి మండలంలో 4వేల మంది డెయిరీలో సభ్యత్వం తీసుకోగా, దశల వారీగా గేదెలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.