
●ఉత్తమ అధ్యాపకులుగా ఇద్దరు...
ఖమ్మం సహకారనగర్: ఇంటర్‌మీడియట్ విద్యాశాఖ పరిధిలో ఉత్తమ అధ్యాపకుల జాబితాలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం దక్కింది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాల జువాలజీ విభాగాధిపతి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునంద, కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఇందులో ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో వీరిద్దరు ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. బోధనలో వినూత్న పద్ధతులు, పరిశోధనా పత్రాల సమర్పణ తదితర అంశాల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సునంద, శ్రీనివాస్‌కు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా, వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ సీ.హెచ్.శ్రీనివాస్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

●ఉత్తమ అధ్యాపకులుగా ఇద్దరు...