
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం సహకారనగర్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్, టీబీ సంబంధిత అంశాలపై హైదరాబాద్‌లో ఈనెల 2న యూత్ ఫెస్ట్‌లో భాగంగా రాష్ట్రస్ధాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఖమ్మం ఏఎస్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. జిల్లా స్థాయి లో ప్రథమ స్థానం సాధించిన దేవీశ్రీ ప్రసన్న, సమీర్‌పాషా రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా, అక్కడ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడిషనల్ డీఎంహెచ్‌ఓ పి.వెంకటరమణ, ప్రిన్సిపాల్ ఆర్.గోవిందరావు గురువారం అభినందించారు. అధ్యాపకులు నరేష్, డి.రాణితో పాటు సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యాన అన్నదానం
ఖమ్మంవ్యవసాయం: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా జిల్లా ఫారెస్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలోని జిల్లా అటవీ కార్యాలయంలో మహా అన్నదానం నిర్వహించారు. వినాయక ఉత్సవాల్లో పలుచోట్ల అన్నదానం నిర్వహించడమే సాధారణమే అయినా ప్రభుత్వ శాఖ ఆధ్వార్యన ఐక్యతా బావాన్ని పెంచే లక్ష్యంతో నిర్వహించడంపై పలువురు అభినందించారు. ఈసందర్భంగా జిల్లా అటవీ అధికారి స్వయంగా వంటలు చేయగా.. అటవీ డివిజన్ల అధికారులు, రేంజర్లు, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.
విజయ డెయిరీ కాంప్లెక్స్‌కు టెండర్లు కరువు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం రోటరీనగర్‌లో ప్రధాన రహదారి వెంట ఉన్న విజయ డెయిరీ ఆధ్వర్యాన నిర్మించిన 10 దుకాణాల కాంప్లెక్స్‌లో అద్దెకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కో షాప్ అద్దె కనిష్టంగా జీఎస్టీ కాక రూ.25వేలుగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. గతనెల 8న నోటిఫికేషన్ విడుదల చేసి ఈనెల 3వ వరకు సమయం ఇచ్చినా టెండర్లు దాఖలు కాలేదని డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. దీంతో అద్దె సవరిస్తూ మరోసారి టెండర్ల స్వీకరణకు కలెక్టర్ అనుమతి కోరనున్నామని వెల్లడించారు.
క్రమశిక్షణతో
ఉన్నతస్థాయికి చేరాలి
కల్లూరు: ప్రతీ విద్యార్థి క్రమశిక్షణను అలవాటు చేసుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ తెలిపారు. కల్లూరు గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో గురువారం ఇన్‌స్పైర్, ఇగ్నైట్ ఆధ్వర్యాన నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్, అబ్దుల్‌కలాం వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవడమే కాక విద్యాలయాలను ఆలయాలుగా భావిస్తే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి మాట్లాడుతూ కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె.లక్ష్మారెడ్డి, రిసోర్స్ పర్సన్లు రంజిత్, యు.శ్రీరామ్, కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ, ఎస్‌ఐ హరిత, మార్కెట్ చైర్‌పర్సన్ భాగం నీరజ, తహసీల్దార్ పులి సాంబశివుడు, నాయకులు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు