
ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఫిర్యాదును కూడా పెండింగ్‌లో పెట్టొద్దని తెలిపారు. అలాగే, అన్ని శాఖల ఆధ్వర్యాన ఫైళ్ల బదలాయింపు ఈ–ఆఫీస్ విధానంలోనే చేపట్టాలని స్పష్టం చేశారు.
● ప్రమాదవశాత్తు మరణించిన మల్టీ పర్పస్ వర్కర్ వీరస్వామి కుటుంబానికి మంజూరైన రూ.10 లక్షల బీమా పరిహారం చెక్కును కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మల్టీ పర్పస్ వర్కర్లు 2,087 మందికి పోస్టల్ శాఖ ద్వారా ప్రమాద బీమా చేయించామని తెలిపారు.
● స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇచ్చేందుకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. ఈసమావేశాల్లో జెడ్పీ సీఈఓ దీక్ష రైనా, డీపీఓ ఆశాలత, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఆర్‌డీఓ సన్యాసయ్య, కలెక్ట్టరేట్ ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
● అలాగే, జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన 13మంది అధికారులు, సిబ్బందిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అనుదీప్ సన్మానించారు. వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన డాక్టర్ కె.శ్రీనివాసరావు, ఏ.వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, పీ.వీ.నాగేందర్‌రావు, ఎస్.విజయకుమార్, డాక్టర్ కె.సుధారాణి, విజయ్, ఎన్.ఎల్లస్వామి, జహీరుద్దీన్, వెంకటేశ్వర్లు, బి.నరసయ్య, రాంచందర్, పద్మను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కాగా, డీపీఆర్వో కార్యాలయ డ్రైవర్ నరసయ్యను డీపీఆర్వో గౌస్, ఉద్యోగులు సైతం సన్మానించారు.
ఈ–ఆఫీస్ ద్వారానే ఫైళ్ల బదలాయింపు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
11న నులి పురుగుల నివారణ దినోత్సవం
ఖమ్మంవైద్యవిభాగం: నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 – 19 ఏళ్ల పిల్లలకు ఈనెల 11న నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు వేయాలని, ఎవరైనా మిగిలితే ఆగస్టు 18న అందించాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాట్లు మొదలుపెట్టాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ కళావతిబాయి మాట్లాడగా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారం