
21 అడుగులకు పాలేరు
మండలంలోని పాలేరు రిజర్వాయర్ సోమవారం సాయంత్రం 21అడుగులకు చేరింది. రిజర్వాయర్ నీటిమట్టం 23 అడుగులు కాగా మరో రెండు అడుగులు చేరితే పూర్తిస్థాయిలో నిండుతుంది. సాగర్ నుండి ఇన్‌ఫ్లో 3,642 క్యూసెక్కులకు తోడు మరో 600 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో ఎడమ కాల్వ, పాలేరు పాత కాల్వ, భక్త రామదాసు ప్రాజెక్టుకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కాగా, ఖమ్మం నిజాంపేటకు చెందిన ఓ వ్యక్తి సాగర్ కాల్వలో గల్లంతవగా గాలింపు చర్యల కోసం ఇన్‌ఫ్లో తగ్గించిన అధికారులు మృతదేహం లభించాక సరఫరా యథావిధిగా కొనసాగిస్తున్నారు. – కూసుమంచి