
సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సీనియారిటీ ఆధారంగా జాబితా విడుదల చేయగా ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం డీఈఓ కార్యాలయంలో మొదలుపెట్టారు. ఇద్దరు గెజిటెడ్ హెచ్‌ఎంలు, డీఈఓ కార్యాలయ ఉద్యోగితో ఏర్పాటైన ఏడు బృందాలు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఈమేరకు 260మందిని అర్హులుగా గుర్తించగా, తొలిరోజు 213 మంది ఉపాధ్యాయులు హాజరుకావడంతో సర్టిఫికెట్ల పరిశీలన రాత్రి వరకు కొనసాగింది.
న్యాయం చేయాలని ఎల్‌పీల వినతి
పదోన్నతుల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని తెలుగు, హిందీ లాంగ్వేజ్ పండిట్లు పలువురు వాపోయారు. కొందరిని గత ఏడాది ఎస్‌ఏలుగా అప్‌గ్రేడ్ చేయగా.. ప్రస్తుతం ఎస్‌ఏ తెలుగు ఖాళీలు 26కి 18, హిందీ ఖాళీలు 16కు గాను 11గానే చూపించారని తెలిపారు. ఈమేరకు వాస్తవ సంఖ్య ఆధారంగా అర్హులకు పదోన్నతులు కల్పించాలని డీఈఓ కార్యాలయంతో పాటు తమకు అండగా నిలవాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావుకు వినతిపత్రాలు అందజేశారు.
హాజరైన 213 మంది ఉపాధ్యాయులు