
ఉద్యోగుల పక్షాన నిలబడతాం..
ఖమ్మంరూరల్: ఏదులాపురం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల పక్షాన నిలబడతామని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈజేఏసీ జనరల్ సెక్రటరి ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మండలంలోని సత్యనారాయణపురంలో గల టీసీవీరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఏదులాపురం ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాస్తవానికి మున్సిపాలిటీ పరిధిలో చాలాకాలనీలు ఉన్నాయని, అవన్నీ గత పాలకుల కాలంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 40 వరకు వెంచర్లు ఉన్నాయని, వాటిలో ఉన్న వారంతా కమిటీగా ఏర్పడటం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సమస్య ఉంటే తనను నేరుగా కలవొచ్చని చెప్పారు. కార్యక్రమంలో భైరు హరినాథ్‌బాబు, విజయ్, పెరుమాళ్లపల్లి శ్రీనివాసులు, కె.సత్యనారాయణ, ఊడుగు వెంకటేశ్వర్లు, జయపాల్, బి.శోభన్, టి.శ్రీనివాస్, కిషన్‌నాయక్, డి.నాగమణి, శ్రీదేవి, మద్ది పుల్లయ్య, సాయిబాబా, జి.మల్లికార్జున్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని రాజీవ్‌గృహకల్పలో జరిగిన సమావేశంలోనూ ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. సమావేశంలో గుంటుపల్లి శ్రీనివాసరావు, కె.సత్యనారాయణ, వెంకన్న, లలితకుమారి, టి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు
ఏలూరి శ్రీనివాసరావు