
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) నుంచి గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఏ, గ్రేడ్–2 హెచ్‌ఎంలకు సంబంధించిన ఖాళీలను ప్రకటించడంతో పాటు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు అర్హులైన వారి జాబితాను సైతం వెల్లడించారు. దీంతో ఆది, సోమవారాల్లో డీఈఓ కార్యాలయ సిబ్బంది అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అలాగే సోమవారం నుంచి సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సీనియారిటీ జాబితాపై 25 మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు సమర్పించారు. అందులో పేర్లు లేనివి 9 ఉండగా.. మిగతావి కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్‌ఏ ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు ఇప్పటికే అర్హులైన వారి జాబితా ప్రకటించగా.. వారి సర్టిఫికెట్లను సోమ, మంగళవారాల్లో పరిశీలించనున్నారు. ఇందుకోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు.
ఎనిమిది బృందాలతో వెరిఫికేషన్