
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
వైరా/తల్లాడ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ సూచించారు. వైరా, తల్లాడ మండలం నారాయణపురంలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈమేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పారు. అయితే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు సాధించేలా బీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవితో పాటు నాయకులు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, భూమాత కృష్ణమూర్తి, కాపా మురళీకృష్ణ మాదినేని సునీత, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దొడ్డా శ్రీనివాసరావు, దుగ్గిదేవర వెంకట్‌లాల్, మువ్వా మురళి, బద్దం కోటిరెడ్డి, పెరికె నాగేశ్వరరావు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కటికి నరసింహారావు, రఘు, కేతినేని చలపతిరావు, అయిలూరి ప్రదీదీరెడ్డి, తూము శ్రీనువాసరావు పాల్గొన్నారు.
●ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో 88మందికి మంజూరైన రూ.22 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేసి మాట్లాడారు. నాయకులు సామినేని హరిప్రసాద్, బెల్లం వేణు, అజ్మీరా వీరునాయక్, బాషబోయిన వీరన్న, కనగాల వెంకటరావు, వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, కర్నాటి కృష్ణ, రుద్రగాని శ్రీదేవి, పోట్ల శీను, లకావత్ గిరిబాబు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బంక మల్లయ్య, బలుసు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు