
నానో యూరియాతో మంచి ఫలితాలు
వైరా: పంటల్లో సంప్రదాయ గుళికల యూరియాకు బదులు నానో యూరియా వాడడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలో నానో యూరియా, నానో డీఏపీపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. రైతులు అవసరం మేరకే యూరియా వాడడం ద్వారా భూసారాన్ని సంరక్షిస్తూ ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ మేడా రాజేష్, రైతులు పాల్గొన్నారు.
●ఖమ్మంవ్యవసాయం: రైతులు నానో యూరియా వినియోగానికి అలవాటు పడుతున్నారని డీఏఓ పుల్లయ్య తెలిపారు. ఖమ్మంలోని ఫర్టిలైజర్ షాప్‌లను ఏఓ కిశోర్‌బాబుతో కలిసి తనిఖీ చేశాక మాట్లాడారు. నానో యూరియాతో లాభాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.