
ఓయూ నుంచి డాక్టరేట్
తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయికి చెందిన ధర్మపురి మధుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఉపేందర్ పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ప్రస్తుతం మధు హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
16మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
తల్లాడ/తిరులాయపాలెం: తల్లాడ మండల కేంద్రంతో పాటు అన్నారుగూడెంలో పేకాట స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యాన దాడులు నిర్వహించగా అన్నారుగూడెంలో తొమ్మిది మంది, తల్లాడ మామిడి తోటలో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరినుంచి రూ.14,390 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే, తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేయగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో తెగిపడిన చేయి
కల్లూరు: మండలంలోని చెన్నూరు సమీపాన గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నకోరుకొండికి చెందిన నామా ఆంధ్రాబాబు టాటా ఏస్‌లో కల్లూరు వస్తున్నాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టగా, బయట పెట్టిన ఆయన చేయికి తాకడంతో తెగిపడింది. ఈమేరకు తీవ్రంగా గాయపడిన బాబును ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
మార్కెట్ ఉద్యోగిపై కేసు నమోదు
ఖమ్మంక్రైం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై దాడి చేసి ఘటనలో అసిస్టెంట్ సెక్రటరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్‌లో పనిచేస్తున్న తాడేపల్లి చంద్రకాంత్‌ను గత నెల 23న అసిస్టెంట్ సెక్రటరీ వీరాంజనేయులు దూషిస్తూ అంతు చూస్తానంటూ మెడ పెట్టి గెంటేశాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు.

ఓయూ నుంచి డాక్టరేట్