
రైతులకు చుట్టాలుగా చట్టాలు..
మధిర/ఖమ్మం రూరల్/ఎర్రుపాలెం/బోనకల్: ఏ చట్టం చేసినా రైతులకు అండగా నిలిచేలా ఉండాలని.. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యాన సాగు న్యాయ యాత్ర నిర్వహిస్తున్నామని న్యాయవాది, భూహక్కులు, వ్యవసాయ చట్టాల నిపుణుడు సునీల్ తెలిపారు. మధిర, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, బోనకల్, ఎర్రుపాలెంలో శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ(లీప్స్) సంస్థ సహకారంతో జూన్ 28న మొదలైన యాత్ర అక్టోబర్ 2వరకు 2,400 కి.మీ. మేర సాగనుండగా 8వేల గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 450 రెవెన్యూ గ్రామాల్లో భూముల సర్వే చేపట్టగా, లైసెన్స్‌డ్ సర్వేయర్లు త్వరలోనే విధుల్లో చేరనున్నారని పేర్కొన్నారు. అనంతరం రైతుల భూహక్కుల సమస్యలు, నకిలీ విత్తనాలు, ఎరువులు, పంటల బీమాపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమాల్లో భూభారతి రూపకర్తల్లో ఒకరైన బి.హరివెంకటప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, లీప్స్ సంస్థ ప్రతినిధులు జీవన్, అభిలాష్, మల్లేష్, రవి, ప్రవీణ్‌తో పాటు తహసీల్దార్లు రమాదేవి, పి.రాంప్రసాద్, ఉషాశారద, ఏఓలు సాయిదీక్షిత్, పి.వినయ్‌కుమార్, ఉమానగేష్, మధిర మార్కెట్ బండారు నరసింహారావు, వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కడియం శ్రీనివాసరావు, ఏఈఓలు బి.రజిత, పి.అనూష, ఎం.త్రివేణి, జి.హరికృష్ణ, షేక్ హుస్సేన్ సాహెబ్, ఎన్.నాగసాయి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పలు మండలాల్లో సాగు న్యాయయాత్ర