
పత్తి పంట ధ్వంసంపై ఆగ్రహం
కారేపల్లి: ఏపుగా ఎదిగిన పత్తి పంటను ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో ధ్వంసం చేయడంతో ఊరంతా ఏకమైంది. ఆయన అక్రమమార్గంలో పట్టా చేసుకోవడమే కాక పదేళ్లుగా రైతుబంధు నిధులు కాజేస్తూ ఇప్పుడు పత్తి పంటను ధ్వంసం చేయడంతో పోలీసుస్టేషన్ ఎదుటే దేహశుద్ధి చేసిన ఘటన ఇది. మండలంలోని గోవింద్‌తండా గ్రామానికి చెందిన బర్మావత్ భద్రు, ఆయన కుమారుడు దివ్యాంగుడైన సురేష్ తమకు ఉన్న రెండెకరాల్లో ఎకరం భూమిని 1998లో అదే గ్రామానికి చెందిన బర్మావత్ రాందాస్‌కు విక్రయించాడు. అయితే, రెండెకరాలకు లింకు డాక్యుమెంట్‌ను తీసుకున్న ఆయన అక్రమమార్గంలో మొత్తానికి పట్టా చేయించుకున్నాడని, ఇటీవల భూమి తనదేనని దౌర్జన్యం చేస్తున్నాడని భద్రు ఆరోపిస్తున్నాడు. ఈక్రమంలోనే ఏపుగా పెరిగిన పత్తి పంటను ధ్వంసం చేశాడు. దీంతో ఇరుపక్షాలు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రు, సురేష్‌కు మద్దతుగా ఊరంతా ట్రాక్టర్లపై పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇంతలోనే అక్కడకు వచ్చిన రాందాస్‌కు దేహశుద్ధి చేయగా సీఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ బి.గోపి వారిని చెదరగొట్టి రాందాస్‌ను స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. కాగా, పత్తి చేను ధ్వంసం చేసిన రాందాస్‌తో పాటు స్టేషన్ ముందు ఆందోళన చేసిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నిందితుడికి పోలీసుస్టేషన్ ఎదుటే దేహశుద్ధి