
రెండు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
ఖమ్మంవైద్యవిభాగం: నిర్లక్ష్యంగా వైద్యం అందించి ఓ మహిళ మృతికి కారణమైన ఖమ్మంలోని బ్రీత్ ఆస్పత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తెలిపారు. గతనెల 23న తల్లాడకు చెందిన కె.శ్రీదేవి(34) ఖమ్మం మయూరిసెంటర్‌లోని బ్రీత్ ఆస్పత్రిలో చేరగా చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు ఘటనకు కారణమని తేలడంతో ఇటీవల సమీక్షలో అధికారులను కలెక్టర్ అనుదీప్ మందలించారు. దీంతో డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం అధికారి చందునాయక్ శుక్రవారం ఆస్పత్రిలో తనిఖీ చేపట్టి సీజ్ చేశారు. అలాగే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
నకిలీ బిల్లుల కేసులో ‘మార్వెల్’
ఖమ్మం వైరారోడ్డులోని మార్వెల్స్ ఆస్పత్రిని సైతం అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ సుమారు 168 మందికి చికిత్స చేయకున్నా నకిలీ పత్రాలు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా బిల్లులు తీసుకున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదుతో తనిఖీ చేపట్టి సీజ్ చేశామని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి తెలిపారు. అక్కడి పేషంట్లను ప్రభుత్వ ప్రధానాస్పత్రికి తరలించడమే కాక ఆస్పత్రి బాధ్యులపై పోలీస్‌షన్‌లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.