
నిబద్ధతతో సేవలందించిన వెంకటనాగేశ్వరరావు
ఖమ్మం మయూరిసెంటర్: వృత్తి నిబద్ధతతో విధులు నిర్వర్తించిన వనం వెంకట నాగేశ్వరరావు సంస్థపై ప్రజల్లో నమ్మకం పెంచారని బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఇంజనీర్ వెంకట నాగేశ్వరావు ఉద్యోగ విరమణ సన్మాన గురువారం ఖమ్మంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎం రాజశేఖర్, ఏజీఎంలు సుష్మా, శ్రీనివాస్, పీఎస్‌ఎన్‌ఎల్ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ ఎక్కడైనా సమస్య వస్తే రాత్రీపగలు తేడా లేకుండా ఆయన స్పందించేవారని కొనియాడారు. అనంతరం వెంకటనాగేశ్వరావు – స్వర్ణలత దంపతులను పలువురు సన్మానించగా అర్చకులు బొర్రా వాసుదేవాచార్యుల బృందం వేద మంత్రాలతో ఆశీర్వదించింది. ఈకార్యక్రమంలో నాగేశ్వరరావు కుమార్తె, కుమారుడు రాణి రాజ్యలక్ష్మి, రాజీవ్, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తిరుమలాచార్యులు, బీఆర్.వీరస్వామి, సోమగాని ఉపేందర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.