
తల్లి పాలు.. అమృతధారలు
● పెద్దాస్పత్రిలో మిల్క్ బ్యాంక్ ద్వారా సేకరణ ● వేలాది మంది చిన్నారులకు లబ్ధి ● నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు
ఖమ్మం వైద్యవిభాగం: వివిధ కారణాలతో కొందరు బాలింతలకు చనుబాలు సరిపడా వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఫలితంగా వారి శిశువులకు పాలు పట్టే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక కొందరికి చనుబాలు ఉన్నా అపోహలతో పిల్లలకు పట్టడం లేదు. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం ఎదురవుతోంది. ఈమేరకు తల్లి పాల ప్రాముఖ్యతపై ప్రచారం చేయడమే కాక గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు శుక్రవారం మొదలుకానున్న నేపథ్యాన జిల్లా పెద్దాస్పత్రిలోని ‘మిల్క్ బ్యాంక్’పై కథనం.
2022లో ఏర్పాటు
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లుల నుండి పాలు సేకరించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిల్క్ బ్యాంక్ పేరుతో 2022 మే నెలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా వేలాది మంది శిశువులకు లబ్ధి జరుగుతోంది. కొందరు బాలింతలకు చనుబాలు రాకపోగా.. ఇంకొందరికి పిల్లలకు అవసరమైన పాల కంటే ఎక్కువగా వస్తుంటారు. ఇలాంటి వారి నుంచి పాలు సేకరించి మిల్క్ బ్యాంక్‌లోని ప్రత్యేక ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. ఆపై అవసరమైన వారికి అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం కొనసాగుతోంది. గర్భిణులను ప్రతీనెలా వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి వస్తున్న నేపథ్యాన వారికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూనే అధికంగా పాలు ఉంటే బ్యాంక్‌కు ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా ఏటేటా ఈ మిల్క్ బ్యాంకుకు పాలు సమకూర్చే బాలింతల సంఖ్య పెరుగుతోంది.
పెద్దాస్పత్రిలోని మిల్క్ బ్యాంక్ ద్వారా సేకరించి, పిల్లలకు ఇచ్చిన పాల వివరాలు
ఏడాది బాలింతలు సేకరించిన పాలు పిల్లలకు అందించిన లబ్ధి పొందిన
(లీటర్లలో) పాలు (లీటర్లలో) శిశువులు
2022 396 139 138 480
2023 901 277 239 1,145
2024 929 295 288 3,851
2025 1,163 167 181 2,541
(ఇప్పటి వరకు)

తల్లి పాలు.. అమృతధారలు