
వడలిపోతున్న పత్తి మొక్కలు
● చేన్లలో నీటి నిల్వతో దెబ్బతింటున్న వేరు వ్యవస్థ ● సమగ్ర యాజమాన్య పద్ధతులతోనే పంటకు రక్షణ
బోనకల్: ఇటీవల వరుస వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది. మేలో తొలకరి జల్లులు పడడంతో రైతులు పత్తి విత్తనాలను విత్తారు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో మొక్కలను బతికించుకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా పడిన జల్లులకు పత్తిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఇంతలోనే వారం రోజులుగా ఎడతెరిపి లేని భారీవర్షాలకు పత్తి పొలాల్లో నీరు నిలిచింది. రైతులు సాధ్యమైనంత మేర నీటిని బయటకు పంపినా ప్రతి రోజూ వర్షం పడడంతో భూమి అధిక నీరు పీల్చుకోవడంతో మొక్క వేరు వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పుడు పొడి వాతావరణంతో ఎండకు పత్తి మొక్కలు వడలిపోతుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పత్తి పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బోనకల్ మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్‌కుమార్ చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.

వడలిపోతున్న పత్తి మొక్కలు