
వేతనాలు పెంచాలి.. పర్మనెంట్ చేయాలి
ఖమ్మంమయూరిసెంటర్: సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీయూసీఐ(ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామయ్య డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వడంతో పాటు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్‌తో గురువారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్, బస్టాండ్, వైరా రోడ్ మీదుగా జెడ్పీ సెంటర్ వరకు ఈ ప్రదర్శన జరగగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో రామయ్య మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలని, బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీయూసీఐ నాయకులు కె.శ్రీనివాస్, ఆవుల అశోక్, పి.రామదాస్, ఈ.శరత్, ఎస్.కే.లాల్ మియా తదితరులు మాట్లాడగా డీఆర్‌ఓ, డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో నాయకులు కె.పుల్లారావు, ములకలపల్లి లక్ష్మీనారాయణ, గోసు పుల్లయ్య, పేరబోయిన వెంకన్న, అంబేద్కర్ అశోక్, పాపారావు, మధుర, కృష్ణవేణి, బి.రమేష్, జె.రాంబాబు, దున్న గురవయ్య, కిన్నెర నారాయణ, గొడుగు విజయ్, పెదపాక వెంకన్న, అమరపుడి అప్పారావు, మీగడ సైదులు, కంకణాల శ్రీనివాస్, ఎడ్లపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
‘పద్మమ్’ స్టోర్ వద్ద నటి రీతూవర్మ, నిర్వాహకులు