
విద్యార్థులు లక్ష్యం దిశగా సాగాలి
చింతకాని: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. టా యిలెట్లు, తాగునీటి వసతి, వంటగది, మధ్యాహ భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి పర్వీన్ ఖైసర్, ఎంఈఓ సలాది రామారావు, ఏఈ రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.