
సంతాన సాఫల్య కేంద్రాల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో విచ్చలవిడిగా సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. మంగళవారం సాక్షిలో ‘దంపతులతో దాగుడు మూతలు’ కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ అనుదీప్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను ఎప్పటి కప్పుడు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఎంహెచ్‌ఓ కళావతిబాయి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై దాడులు చేయాలని నిర్ణయించారు. గురువారం నుంచి తనిఖీలు ప్రారంభిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సంతాన సాఫల్య కేంద్రాలు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021, సరోగసీ (రెగ్యులేషన్) చట్టం 2021 ప్రకారం చట్ట నియమాలు, నిబంధనలు పాటించాలని ఆదేశించారు.