రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

Jul 31 2025 7:38 AM | Updated on Jul 31 2025 8:32 AM

రాష్ట

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

బోనకల్‌: ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరుగుతున్న అథ్లెటిక్స్‌ రాష్ట్రస్థాయి పోటీల ఎంపికల్లో ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న షేక్‌ ఫరీదా ప్రతిభ చూపింది. ఆమె అండర్‌–14 జట్టుకు ఎంపికై , వచ్చే నెల 3వ తేదీన వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఆడనున్నట్లు హెచ్‌ఎం భాగ్యలక్ష్మి బుధవారం తెలిపారు. పీడీ నవీద్‌పాషా, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

మహిళా డెయిరీని

సద్వినియోగం చేసుకోవాలి

మధిర: ఇందిరా మహిళా డెయిరీని మహిళా సంఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ పురంధర్‌ తెలిపారు. మధిర ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా డెయిరీ మొదటి విడత పాడి గేదెల కొనుగోలు లబ్ధిదారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో ఎస్సీ లబ్ధిదారులకు 80 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలను అందజేస్తారని, ముర్రా జాతి గేదెలను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డీపీఎం శ్రీనివాస్‌, మండల పశువైద్యాధికారి ఉమాకుమారి, ఐకేపీ ఏపీఎం సుబ్బారావు, ఏఓ సాయి దీక్షిత్‌, లబ్ధి దారులు, తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత చదువులకు ఉపయోగం

ముదిగొండ: మధ్యలో చదువు మానేసిన వారికి ఉన్నత చదువుల కోసం ఓపెన్‌ స్కూల్‌ మంచి అవకాశమని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు అన్నారు. ముదిగొండలో బుధవారం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ పొందేందుకు 80084 03522 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి, స్పెషల్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి, భాస్కర్‌రావు, డి.శోభారాణి, నాజర్‌, పాల్గొన్నారు.

సావనీర్‌ ఆవిష్కరణ

ఖమ్మంగాంధీచౌక్‌: నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలస్థాయి ఆహ్వాన నాటిక పోటీలను నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కళాపరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నాగబత్తిని రవి, మిత్రా ఫౌండేషన్‌ చైర్మన్‌ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్‌, అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ కళా సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి ఏఎస్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నెలనెలా వెన్నెల వార్షికోత్సవ సావనీర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్‌రావు, కొత్తూరు దేవేంద్ర, వేల్పుల విజేత, వేముల సదానందం, నందిగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తికి జైలు శిక్ష

ఖమ్మంలీగల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా జమ్మాపూర్‌ గ్రామానికి చెందిన బంధనాథము సాగర్‌కు ఆజాగ్రత్తగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ స్థానిక స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి బి.నాగలక్ష్మి బుధవారం తీర్పు చెప్పారు. ఫిర్యాది మాతంగి వెంకటేశ్‌.. తన తమ్ముడు నరేశ్‌ (22) 2018, మార్చి 29న మో టార్‌ సైకిల్‌పై పాలేరు వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. నరేశ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా మరునా డు మృతిచెందాడు. కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు డీసీఎం డ్రైవర్‌ సాగర్‌పై కోర్టులో చార్జిషీటు దాఖ లు చేశారు. విచారణ అనంతరం నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ వీరయ్య వాదించగా లైజన్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, నాగేశ్వరరావు కోర్టు పీసీ భార్గవ్‌ సహకరించారు.

యూటీ నిర్మాణ

పనుల పరిశీలన

కూసుమంచి: సాగర్‌ ఎడమ కాలువకు పాలేరు వద్ద నిర్మిస్తున్న యూటీ పనులు తుది దశకు చేరగా బుధవారం నీటిపారుదల శాఖ ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లుతో పాటు క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ వెంకటరమణా రావు, ఇతర అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం కాలువకు 2,600 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా యూటీ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. కాలువకు నీటి విడుదల పెంపుతో కలిగే ఇబ్బందులపై చర్చించారు. కార్యక్రమంలో డీఈఈ మాధవి పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌  పోటీలకు ఎంపిక1
1/2

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌  పోటీలకు ఎంపిక2
2/2

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement