
హామీల అమలులో విఫలం
తల్లాడ: రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. తల్లాడ జీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో మోరంపూడి పాండు అధ్యక్షతన జరిగిన సత్తుపల్లి డివిజన్ కమిటీ ప్లీనరీలో తమ్మినేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు జరిగిన సభల్లో కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పి.. ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల వరకే మభ్యపెట్టి ఆ తర్వాత ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎత్తి వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయం చేస్తోందని తెలిపారు. సమావేశంలో పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వర్‌రావు, తాతా భాస్కర్‌రావు, మాచర్ల భారతి, మాదినేని రమేశ్, చలమాల విఠల్‌రావు, శీలం సత్యనారాయణరెడ్డి, ఐనాల రామలింగేశ్వర్‌రావు, జాజిరి శ్రీనివాసరావు, మాదాల వెంకటేశ్వర్‌రావు, తన్నీరు కృష్ణార్జున్ పాల్గొన్నారు.
నాలుగు నెలల తర్వాత కుటుంబం చెంతకు..
ఖమ్మంక్రైం: నాలుగు నెలల కిందట తప్పిపోయిన ఓ వ్యక్తిని అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గత ఏప్రిల్ 17న విజయవాడ నుంచి ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో బంధువులను చూడటానికి వచ్చిన రవికుమార్.. మతిస్థిమితం కోల్పోయి పోన్నెకల్ పరిసరాల్లో తిరుగుతుండగా.. మాలోత్ మున్నానాయక్ కుటుంబ సభ్యులు చేరదీశారు. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించగా ఆయన తన ఆశ్రమానికి తీసుకొచ్చి వివరాలు సేకరించారు. టూటౌన్ పోలీసుల సమాచారంతో విజయవాడలోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఖమ్మం వచ్చారు. వారికి రవికుమార్ సీఐ బాలకృష్ణ సమక్షంలో అప్పగించారు.

హామీల అమలులో విఫలం