
యూరియా కోసం బారులు
కల్లూరురూరల్: ఈ వానాకాలం సీజన్ అవసరాలకు కల్లూరు, చెన్నూరు, కొర్లగూడెం, పోచవరం, చిన్నకోరుకొండి పీఏసీఎస్‌లకు 570 మెట్రిక్ టన్నులు, డీలర్లకు 575 మెట్రిక్ టన్నుల యూరి యా సరఫరా అయింది. ఈ యూరియా రైతులందరికీ సరిపోయే పరిస్థితి లేకపోగా, భవిష్యత్‌లో మరింత కొరత వస్తుందనే ప్రచారంతో కొనుగోలుకు బారులు దీరుతున్నారు. ఫలితంగా భూమి ఆధారంగా యూరియా పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలోనే కల్లూరు, చెన్నూరు సొసైటీల వద్ద మంగళవారం రైతులు బారులు దీరగా ఏఓ రూప, ఎస్సై హరిత యూరియా పంపిణీని పర్యవేక్షించారు.