
గురుకులంలో డీపీఓ తనిఖీ
ఎర్రుపాలెం: ప్రభుత్వ నిర్దేశిత మెనూ అమలవుతోందా, భోజనం నాణ్యతగా ఉంటుందా.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ఆరా తీశారు. ఎర్రుపాలెంలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆమె భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే, పారిశుద్ధ్య నిర్వహణపై ఉద్యోగులకు సూచనలు చేసిన డీపీఓ, సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఆతర్వాత బనిగండ్లపాడు పీహెచ్‌సీని తనిఖీ చేస డాక్టర్ అశ్విని నుంచి వివరాలు సేకరించారు. అలాగే, దళిత కాలనీలో పారిశుద్ధ్య పనులను కూడా తనిఖీ చేశారు. ఎంపీఓ జి.శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఏలేశ్వరరావు పాల్గొన్నారు.