
డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు
తిరుమలాయపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో డెంగీ కేసులు నమోదైనందున జ్వరాల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీ ఉద్యోగులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఆదేశించారు. తిరులాయపాలెం మండలంలోని చంద్రుతండాలో ఏడుగురికి డెంగీ నమోదు కావడంతో మంగళవారం ఆమె గ్రామాన్ని పరిశీలించారు. డెంగ్యూ సోకిన వారి ఇళ్లలో అందరికీ పరీక్షలు చేయించడమే కాక సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం మండలంలోని మహ్మదాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసి పారిశుద్ధ్య నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని సూచనలు చేశారు. ఆతర్వాత సుబ్లేడు పీహెచ్‌సీలో తనిఖీ చేసిన అదపు కలెక్టర్ మందుల లభ్యత, పరీక్షల నిర్వహనపై ఆరా తీసి ప్రతీ గ్రామపంచాయతీలో వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. డీఎల్‌పీఓ టి.రాంబాబు, వైద్యాధికారి సుబ్బారావు, ఎంపీడీఓ ఎస్.కే.సిలార్ సాహెబ్, ఎంపీఓ సూర్యనారాయణ, డాక్టర్ వసుంధర పాల్గొన్నారు.
ఏటీసీల్లో కోర్సులపై విస్తృత ప్రచారం
ఖమ్మంమయూరిసెంటర్: ఐటీఐ, ఏటీసీల్లో అందుబాటులో ఉన్న ఉపాధి కోర్సులపై విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కేఎంసీ కార్యాలయంలో మంగళవారం ఐటీఐల్లో ప్రవేశాలు, అక్షరాస్యత, పారిశుద్ధ్య నిర్వహణ, పెట్రోల్ పంపుల ఏర్పాటు అంశాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అనువైన స్థలాలు గుర్తించి పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించాలని తెలిపారు. ఏదులాపురం, రఘునాథపాలెం, మధిర, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాలని చెప్పారు. ఐటీఐ, ఏటీసీల్లో 255 సీట్లు ఖాళీగా ఉన్నందున యువత చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అలాగే, నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించడం, ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవసరమైన మరమమ్మతులు, కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుపై సూచనలు చేశారు. డీఈఓ ఎస్.సత్యనారాయణ, డీఐఈఓ రవిబాబు, ఆర్డీఓ నర్సింహారావు, అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ, కేఎంసీ సహాయ కమిషనర్ అనిల్‌కుమార్, మునిసిపల్ కమిషనర్లు సంపత్‌కుమార్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ