
విద్యుత్ సమస్యలు ఎదురుకావొద్దు
ముదిగొండ: జిల్లాలో ఎక్కడా విద్యుత్ సంబంధిత సమస్యలు రాకుండా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ముదిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన ఏఈలతో కలిసి పరిశీలించారు. వల్లబి, పమ్మి గ్రామాల్లో ఇళ్లపై వెళ్తున్న విద్యుత్ లైన్లను సరిచేస్తుండగా సూచనలు చేశారు. అనంతరం ఎస్‌ఈ ముదిగొండ సబ్‌స్టేషన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
●నేలకొండపల్లి: పాలేరు నియోజకవర్గంలో విద్యు త్ సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో రూ.8.87 కోట్ల విలు వైన పనులు చేపట్టామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి వెల్లడించారు. మండలంలోని నేలకొండపల్లి, రాజేశ్వరపురం సబ్‌స్టేషన్ల పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించాక ఆయన మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలో 4,200 స్తంభాల ఏర్పా టు, ఇళ్ల పైనుంచి తీగలు వెళ్తున్న చోట లైన్ల మా ర్పిడి చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో డీఈలు సీహెచ్.నాగేశ్వరరావు, చింతమళ్ల నాగేశ్వరరావు, ఏడీఈ బి.రామకృష్ట, కోక్యానాయక్, ఏఈలు మేకపోతుల శ్రీనివాస్, వి.నారాయణ, కె.రామారావు, నారాయణరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.