
ప్రతిమ మృతిపై కేసు నమోదు
ఖమ్మంరూరల్: మండలంలోని గొల్లగూడెం గిరి జన ఆశ్రమ పాఠశాలలో ఫిట్స్‌తో సోమవారం పదో తరగతి విద్యార్థిని భూక్యా ప్రతిమ మృతి చెందగా, ఆమె తండ్రి రమేష్ ఫిర్యాదుతో రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఫిట్స్‌తోనే మృతి చెందిందా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది నిర్ధారించేందుకు పోలీసలు సీసీ టీవీ పుటేజీలు పరిశీలించడమే కాక ఆమె స్నేహితులు, వార్డెన్, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, ప్రతిమ మృతితో గురుకులం నుంచి పలువురు విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు.
●ఖమ్మం మామిళ్లగూడెం: గొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతికి వార్డెన్, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో పాటు డీడీ పర్యవేక్షణ లోపమే కారణమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈమేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాక విద్యార్థిని కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ డీఆర్‌ఓ పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు. పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంగూరి వెంకటేష్, మాడుపల్లి లక్ష్మణ్, గోకినపల్లి మస్తాన్, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనతో వెళ్లిపోయిన విద్యార్థినులు