
వారిది విద్వేషం.. మాది హక్కుల రక్షణ
కొణిజర్ల: దేశంలో మైనార్టీలు, మెజార్టీల మధ్య మత విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కొణిజర్లలో మంగళవారం నిర్వహించిన పార్టీ వైరా డివిజన్ స్థాయి వర్క్‌షాప్‌లో ఆయ న మాట్లాడారు. బీజేపీ పాలనలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా మతం పేరుతో విభజించి పాలిస్తున్నారన్నారు. ఇదే సమయాన రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కమ్యూనిస్టులుగా తాము కృషి చేస్తున్నామని తెలి పారు. కాగా, రాష్ట్రప్రభుత్వం స్థానిక ఎన్నికలను దృష్ట్యా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో అవకాశం ప్రతీచోట తాము స్వంతంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ్మినేని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ శ్రేణులకు ఇస్తున్నారని విమర్శించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, దుగ్గి కృష్ణ, మచ్చా మణి, కొండెబోయిన నాగేశ్వరరావు, కొప్పుల కృష్ణయ్య, చింతనిప్పు చలపతి రావు, బాణోత్ బాలాజీ, కుటుంబరావు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం