
విలువలను కాలారాస్తున్న బీజేపీ
ముదిగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా స్వామ్య విలువలను కాలరాయడమే కాక ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను నాశ నం చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ముదిగొండలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ హయాంలో ప్రజా ఉద్యమాలపై నిర్భంధం ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ప్రజల హక్కులను కాపాడే బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. కాగా, రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తమ్మినేని తెలిపారు. ఇంది రమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యాన్ని అరికట్టి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భూ పోరాటం చిరస్మరణీయం
ముదిగొండ భూపోరాటం చిరస్మరణీయమైనదని తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూపోరాటంలో భాగంగా పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి వర్ధంతి సభ సోమవారం నిర్వహించగా తమ్మినేని మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మడుపల్లి గోపాలరావు, భట్టు పురుషోత్తం, బండి పద్మ, మంకెన దామోదర్, టీఎస్.కల్యాణ్, వేల్పుల భద్రయ్య, ఇరుకు నాగేశ్వరరావు, మండరపు పద్మావతి, పయ్యావుల ప్రభావతి, మేడ నారాయణ, భట్టు రాజు, దస్తగిరి, మెట్టెల సతీష్, కట్టకూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని