
ఇంటింటా జల్లెడ
● జిల్లాలో మొదలైన ఫీవర్ సర్వే ● జ్వరం వచ్చిన వారికి చికిత్స.. మిగతా వారికి పరీక్షలు ● మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ● సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ
ఖమ్మంవైద్యవిభాగం/రఘునాథపాలెం/సత్తుపల్లి టౌన్: జిల్లాలో వారం పాటు కురిసిన వర్షాలతో పారి శుద్ధ్య సమస్యలు ఏర్పడగా.. దోమలు వృద్ధితో సీజ నల్ వ్యాధులు ప్రబలుతుతున్నాయి. జిల్లాలోని తల్లా డ, తిరుమలాయపాలెం, బోనకల్‌తో పాటు ఖమ్మంలోనూ డెంగీకేసులు నమోదైన నేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటింటా సర్వే ద్వారా వ్యాధుల కట్టడికి నిర్ణయించగా.. ఈనెల 27వ తేదీ నుండి ఇంటింటికికీ వెళ్లి జ్వర పీడితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ చివరి వరకు సాగే ఈ సర్వే కోసం అదనపు కలెక్టర్ శ్రీజ 12 మందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశారు.ఈబృందాలు నిరంతరం వారికి కేటా యిం చిన మండలాల్లో సర్వేను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఏం చేస్తారు?
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే కాక జ్వరం వచ్చిన వారికి చికిత్స అందేలా ఆయా బృందాలు పర్యవేక్షిస్తారు. అంతేకాక జ్వరబాధితుల ఇళ్లలోని అందరి నుంచి రక్తనమూనాలు సేకరిస్తారు. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడే వారికి మందులు ఇవ్వడంతో పాటు డెంగీ వంటి లక్షణాలు ఉంటే నిర్ధారించాక ఆస్పత్రులకు తరలిస్తారు. అలాగే, గ్రామాల్లో ఫాగింగ్ చేయించడం.. మురికి గుంతల్లో టీమోఫాస్ స్ప్రే, ఆయిల్ బాల్స్ వేయిస్తూ జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నచోటట వైద్య శిబిరాలు ఏర్పాటుచేయిస్తారు.
12 మంది అధికారులు
జిల్లాలో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా నిర్వహిస్తున్న సర్వే పర్యవేక్షణకు 12మంది ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు వ్యాధుల సీజనల్ ముగిసే వరకు క్షేత్ర స్ధాయిలో ఉండి మండల స్థాయి బృందా లు చేపట్టే సర్వేను పర్యవేక్షిస్తూనే ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈమేరకు డీఐఓ చందూనాయక్‌కు మూడు మండలాలు కేటాయించగా, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వ్యా క్సిన్ మేనేజర్ వెంకటరమణ, డీపీఓ ఆశాలత, డీఎల్‌పీఓలు జీ.వీ.సత్యనారాయణ, టి.రాంబాబు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.సీతారామ్‌కు రెండు చొప్పున, జిల్లా క్షయ నివారణ అధికారి వి.సుబ్బారావు, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్‌కు ఒక్కో మండల ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ అదనపు కలెక్టర్ శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు.
డెంగీ కేసుల నమోదుతో...
గత ఏడాది జిల్లాలో 529 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది కేసులు రావొద్దని అధికారులు ముందు నుంచి అప్రమత్తంగా ఉన్నారు. అయినా పలు ప్రాంతాల్లో కేసులు వస్తుండడం.. తల్లాడలో ఓ మహిళ మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమై క్షేత్రస్ధాయిలో ఫీవర్ సర్వే నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 20 వరకు డెంగీ కేసులు నమోదు కాగా.. మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేలా కార్యచరణ రూపొందించారు. ఈక్రమంలోనే ఇంటింటి సర్వే ద్వారా ఇళ్లలోని పాత సామగ్రిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, దోమల నివారణకు మెష్‌లు అమర్చేలా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక కాచి చల్లార్చిన నీరే తాగాలని, వేడివేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, గ్రామాల్లో తాగునీరు సరఫరా చేసే ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయిస్తున్నారు.
ఫీవర్ సర్వే తప్పనిసరి...
కొణిజర్ల: ఇంటింటా ఫీవర్ సర్వేపై శ్రద్ధ వహించాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. కొణిజర్ల పీహెచ్‌సీని సోమవారం తనిఖీ చేసిన ఆమె రికార్డులు పరిశీలించాక సిబ్బందికి సూచనలు చేశారు. ఇంటింట ఫీవర్ సర్వే ద్వారా జ్వరబాధితులను గుర్తిస్తే సత్వరమే చికిత్స అందించే వీలు ఉంటుందని తెలిపారు. రహదారుల వెంట, డ్రెయినేజీల్లో నిలిచిన మురుగునీటినిశుభ్రం చేయించాలని, దోమల వ్యాప్తిని అరికట్టేలా ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. ఎంపీడీఓ ఆర్.ఉపేంద్రయ్య, వైద్యాధికారి సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.
నిరంతర పర్యవేక్షణ..
సీజనల్ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ రూపొందించాం. ప్రతిరోజూ ఆరోగ్య బృందాలు తో జ్వర సర్వే, డ్రై డే చేపడున్నాం. దోమల నియంత్రణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగా హన కల్పిస్తూన్తే వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.
– టి.సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సత్తుపల్లి

ఇంటింటా జల్లెడ

ఇంటింటా జల్లెడ

ఇంటింటా జల్లెడ