
రాష్ట్ర ఉషూ టోర్నీలో పతకాలు
ఖమ్మం స్పోర్ట్స్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి ఖేలోఇండియా ఉషూ పోటీ ల్లో జిల్లాక్రీడాకారులు మూడు పతకాలు సా ధించారు. సీనియర్స్ విభాగంలో పి.పవిత్రాచా రికి స్వర్ణపతకం సాధించగా, ఇతర ఈవెంట్లలో డి.హర్షిణి రజతం, టి.సాయి భవ్యశ్రీకి కాంస్య పతకం దక్కించుకున్నారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు.
సస్యరక్షణ చర్యలే కీలకం
కొణిజర్ల: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తగిన సస్యరక్షణ చర్యలతో పంటలను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయాఽధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో పత్తి, పెసర పంటలను సోమవారం పరిశీలించిన ఆయన యాజమా న్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వర్షపు నీరు నిలిచి పత్తికి వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశమున్నందున కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బండిజమ్‌ను తెగులు సోకిన మొక్కల చుట్టూ పిచికారీ చేయాలన్నారు. అలాగే, ఎకరాకు 25కిలోల యూరియా, 20 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, రసాయన ఎరువులను పైపాటుగా మొక్కల మొదళ్లకు 7 – 10 సెం.మీ. దూరాన చల్లాలని తెలిపారు. అలాగే, పూత దశలో ఉన్న పెసరలో ఆకు మచ్చ తెలు గు, పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్ తెగులు సోకుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ డి.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
భాగ్యనగర్‌తండా వాసికి డాక్టరేట్
కారేపల్లి: కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ ఉపేందర్‌రావుకు తమిళనాడులోని చిదంబ రం అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. జనగామ జిల్లా కేంద్రంలోని వికాస్ ఫార్మసీ కాలేజీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రొఫెసర్లు ఎన్.కన్నప్పన్, ఎల్.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు.
పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాకేష్
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన తేలే రాకేష్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. 2014నుంచి పీవైఎల్‌లో కొనసాగుతున్న రాకేష్ నగర కోశాధికారిగా, డివిజన్ కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనను పలువురు అభినందించారు.
ఓటర్ల జాబితాలో
మార్పులు, చేర్పులు
నేలకొండపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న నేపథ్యాన రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈమేరకు తుది ఓటర్ల జాబితా తయారీపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు మార్లు ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఎంపీడీఓల లాగిన్ ద్వారా టీపోల్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది జరిగి ఆరు నెలలు గడిచినందున వార్డుల సంఖ్య పెరగడం లేదా తగడం, ఓటర్లలో మార్పులు, చేర్పులు జరగనున్నందున మరోమారు పరిశీలించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో గ్రామ కార్యదర్శులు పరిశీలిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో మృతి చెందిన వారి పేర్లు తొలగించడంతో పాటు కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లు నమోదు చేస్తారు. ఈ కారణంగా జాబితాలో క్రమ సంఖ్య మారనుంది.

రాష్ట్ర ఉషూ టోర్నీలో పతకాలు

రాష్ట్ర ఉషూ టోర్నీలో పతకాలు