
ఇందిరమ్మ ఇళ్ల సర్వే మరోసారి...
నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్ నమోదు చేసేందుకు మరోమారు సర్వే చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారుల వివరాల నమోదుకు కేంద్రప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. లబ్ధిదారులకు ఇస్తున్న రూ.5లక్షల్లో కేంద్రం వాటా కూడా ఉండగా.. యాప్‌లో నమోదు చేస్తేనే నిధులు విడుదలవుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు సర్వే మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని 13వేల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను 40ప్రశ్నల ద్వారా సేకరించి పీఎంఏజీవై యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఒక్కో ఇంటి వద్ద వివరాల సేకరణకు దాదాపు అర గంటకు పైగా సమయం పడుతుండగా.. ఇంటి వద్ద ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, సోమవారంతో సర్వే ముగించాలని ఆదేశించగా సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదని సమాచారం. ఈనెల 31వరకు సమయం ఇస్తేనే సర్వే పూర్తవుతుందని కార్యదర్శులు చెబుతున్నప్పటికీ అప్పటివరకు యాప్ లాగిన్ ఉంటుందా, లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, జిల్లాలో సర్వే దాదాపు పూర్తి కావొచ్చిందని గృహ నిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు.
ఈసారి కేంద్ర ప్రభుత్వం యాప్‌లో నమోదు