
షటిల్‌కోర్టులో గుండెపోటు
తల్లాడ/ఉప్పల్: రోజులాగే షటిల్ ఆడుతున్న యువకుడు గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తల్లాడ మాజీ ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడైన రాకేష్(25) డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నివాసముంటూ అక్కడి ఓ కార్ల షోరూంలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. చిన్నతనం నుంచే షటిల్‌పై మక్కువ పెంచుకున్న ఆయన నిత్యం సాధన చేసేవాడు. ఇందులో భాగంగానే రోజులగా హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లోని అలైట్ బ్యాడ్మింటన్ ఆకాడమీలోఆదివారం రాత్రి షటిల్ ఆడుతుండగా.. 20 నిమిషాల ఆట అనంతరం రాకేష్ ఉన్నట్టుండి కుప్ప కూలాడు. దీంతో సహచరులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తల్లాడలో విషాదం
రాకేష్ మృతదేహానికి హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం తల్లాడ తీసుకొచ్చారు. కాగా, ఆయన షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌కాగా.. రాకేష్‌కు నివాళుర్పించేందుకు హైదరాబాద్, తల్లాడ నుంచి స్నేహితులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. తమతో పాటు షటిల్ ఆడిన ఆయన గుండెపోటుతో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించడమే కాక ‘మేం కూడా నీతోనే వస్తాం’ అంటూ రోదించడం అందరికీ కంటతడి పెట్టించింది.
కుప్పకూలి మృతి చెందిన తల్లాడ యువకుడు

షటిల్‌కోర్టులో గుండెపోటు