ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్షలు

Jul 28 2025 8:11 AM | Updated on Jul 28 2025 8:11 AM

ప్రశా

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్షలు

ఖమ్మంసహకారనగర్‌: భూ భారతి చట్టం అమల్లో భాగంగా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించే క్రమంలో వారికి గత 50 రోజులుగా అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం థియరీ, మధ్యాహ్నం ప్లాటింగ్‌ పరీక్షలకు 587 మందికి గాను 442 మంది హాజరు కాగా 75.30 శాతం నమోదైంది. కాగా పరీక్షలను సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులు, సీపీఓ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు.

బాలబాలికలకు

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

కల్లూరు: కల్లూరులోని మినీస్టేడియంలో ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అండర్‌–8, 10, 12, 14, 16 బాలబాలికలకు అథ్లెటిక్స్‌లో విడివిడిగా క్రీడా పోటీలు నిర్వహించారు. 60 మీటర్ల పరుగు, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, ఐదు మీటర్ల అప్రోచ్‌ లాంగ్‌ జంప్‌, కిడ్స్‌ జావలెన్‌ త్రో పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయస్థానాలు సాధించిన వారు ఆగస్టు 7వ తేదీన జనగామలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. క్రీడాకారులు, తల్లిదండ్రులకు భోజన వసతి కల్లూరు లయన్స్‌క్లబ్‌ బాధ్యులు చలువాది నగేశ్‌, ఇందోజు రమేశ్‌, కిన్నెర ఆనంద్‌ కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ పత్తిపాటి నివేదిత, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి షఫిక్‌అహ్మద్‌, బి.రవికుమార్‌, ప్రియాంక, స్టేడియం ఇన్‌చార్జ్‌ పసుపులేటి వీరరాఘవయ్య, కోచ్‌లు కండ్రాతి రాధాకృష్ణ, సీహెచ్‌ త్రివేణి, గౌతమ్‌రెడ్డి, గోపి, సతీశ్‌కుమార్‌, ఫిజికల్‌ ట్రైనర్‌ ఎన్‌.నాగబాబు, 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

సమన్వయంతో

పని చేయండి..

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.సీతారాం

సత్తుపల్లిరూరల్‌: వ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నియంత్రణ చర్యలు చేపట్టాలని సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.సీతారాం అన్నారు. ఆదివారం గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, మందుల స్టాక్‌ను పరిశీలించి, మాట్లాడారు. గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహించాలని, ప్రతి జ్వరం కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్‌.అవినాష్‌, స్పందన, సూపర్‌వైజర్‌ శారారాణి, ఫార్మాసిస్ట్‌ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనులు

పకడ్బందీగా నిర్వహించాలి

బోనకల్‌: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రామారావు, డీఎల్‌పీఓ రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముష్టికుంట్ల, బోనకల్‌, తూటికుంట్ల గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పారిశుద్ధ్య పనులు, ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. ముష్టికుంట్లలోని పల్లె దవాఖానలో రికార్డులు, అనంతరం పారిశుద్ధ్య పనులు, బోనకల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపీ, స్టాక్‌ రిజిస్టర్లు, తూటికుంట్లలో ఇంటింటి ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ శాస్త్రి, వైద్యాధికారి స్రవంతి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా  సర్వేయర్ల పరీక్షలు1
1/3

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్షలు

ప్రశాంతంగా  సర్వేయర్ల పరీక్షలు2
2/3

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్షలు

ప్రశాంతంగా  సర్వేయర్ల పరీక్షలు3
3/3

ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement