
‘ఆర్యవైశ్యులకు అండగా కాంగ్రెస్’
వైరా: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని.. తెలంగాణ ఇచ్చింది కూడా ఆ పార్టీయేనని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత అన్నారు. వైరాలోని హరిహర సుత అయ్యప్ప స్వామి మండపంలో జరిగిన ఉమ్మ డి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్యుల రాజకీయ చైతన్య ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలవడంలో ఆర్యవైశ్యుల సహకారం ఎంతో ఉంద ని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ నాయకుడు రాకేశ్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మిడిదొడ్డి శ్యాంసుందర్, రాయల నాగేశ్వరరావు, కొదుమూరి దయాకర్, కొత్తా వెంకటేశ్వరరావు, బొర్రా రాజశేఖర్, శీలం నర్సిరెడ్డి, సీతారాములు, వెంకటేశ్వరరావు, రంగా జనార్దన్, మిట్టపల్లి రాఘవరావు, గ్రంధి ప్రవీణ్, మిట్టపల్లి శ్రీనివాసరావు, ఉపేందర్‌రావు, రాము, భాస్కరరావు, రవికుమార్, నాగేశ్వరరావు, ఈశ్వరి, నాగశ్రీలత, రోజా, మంజులకుమారి, శబరి తదితరులు పాల్గొన్నారు.