
పెద్ద రాళ్లను తొలగించాలి
రాకాసితండా వాసుల వేడుకోలు
తిరుమలాయపాలెం: గతేడాది భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన రాకాసితండా వాసులు ఆకేరు ప్రవాహం పెరుగుతుంటే ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం ఆకేరుపై సీతారామ నీళ్లు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అక్వాటెక్ట్ వద్ద కాంట్రాక్టు నిర్మాణ సంస్థ తమ పొక్లెయిన్‌లు, టిప్పర్లు వెళ్లేందుకు పెద్దపెద్ద బండరాళ్లను వేసి అలాగే వదిలివేశారు. దీంతో గతేడాది ఆకేరు ప్రవాహం పెరిగి నీళ్లు వెళ్లే మార్గం లేక రాకాసితండాను చుట్టుముట్టి తీవ్ర నష్టం జరిగింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు అక్వాటెక్ట్‌కి అడ్డుగా ఉన్న బండరాళ్లు తొలగించకపోవడంతో గ్రామస్తులు ఇటీవల మండల ఎస్‌ఐ జగదీశ్ దృష్టికి తీసుకెళ్లి, చూపించారు. ఆకేరుకు భారీగా వరద వస్తే రాకాసితండాకు ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్వాటెక్ట్‌కి అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించాలని కోరుతున్నారు.