
జాతీయ సదస్సుకు ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుడు
తిరుమలాయపాలెం: నూతన జాతీయ విధానంపై ఢిల్లీలో ఈనెల 29న జరగనున్న జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనాల్సిందిగా తిరుమలాయపాలెం జెడ్పీహెచ్‌ఎస్ జీవశాస్త్రం ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనుండగా, నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్‌లో సభ్యుడైన ప్రభాకర్‌రెడ్డికి ఆహ్వానం పంపించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి విద్యారంగ ప్రముఖులు, విషయ నిపుణులు, నేషనల్ మెంటారింగ్ మిషన్ సభ్యులు పాల్గొని నూతన విద్యావిదానంపై చర్చించనున్నారు. కాగా, జాతీయ సదస్సుకు ఎంపికై న ప్రభాకర్‌రెడ్డిని డీఈఓ సత్యనారాయణ ఏఎంఓ రాజశేఖర్, ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్‌ఎం విజయకుమారి అభినందించారు.