
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది.
మోదీ పాలన
దేశానికే ప్రమాదకరం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలో మోదీ నేతృత్వాన సాగుతున్న పాలన దేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్‌లో శనివారం జరిగిన ఖమ్మం డివిజన్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని.. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక రంగంలో సంస్కరణల్లో వేగం పెంచారని ఆరోపించారు. ముఖ్యంగా రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, కార్మిక చట్టాల సవరణతో అందరికీ నష్టం ఎదురుకానుందని తెలిపారు. అయితే, బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తుండడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు చేస్తూ, పౌరసత్వం నిరూపించుకోవాలని చెబుతుండడం బీజేపీ తీరును తేటతెల్లం చేస్తోందని తెలిపారు. ఈమేరకు కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్మించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. కాగా, కేంద్రప్రభుత్వం దేశవ్యాప్త కులగణనను వ్యతిరేకిస్తుండగా.. కులగణన, రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో పాటు నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బొంతు రాంబాబు, ఎర్ర శ్రీనివాసరావు, విష్ణువర్ధన్, బండా రమేష్, ఎం.ఏ.జబ్బార్, ఎస్.నవీన్‌రెడ్డి, షేక్ మీరా సాహెబ్, దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.