
ఇది కొత్తగా ఉంది...
గోరింటాకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ వాధుల నుంచి రక్షించడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ సంబంధించిన అంశాలను చేతులపై వేయడం కొత్తగా ఉంది. ఈ విధానంతో ఆయా అంశాలపై పట్టు పెరుగుతుంది.
– మధుశాలిని, పదో తరగతి
ఎప్పటికీ మరిచిపోకుండా..
గోరింటాకుతో చేతులపై వివిధ డిజైన్లను చిత్రించవచ్చు. మా పాఠశాల ఉపాధ్యాయులు డిజైన్ల స్థానంలో గణితం, జీవ, భౌతిక శాస్త్రాలకు అంశాలను వేయించారు. చేతులపై ఉన్న ఫార్ములాలు తరచూ చదువుతుండడంతో ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోయే అవకాశం ఉండదు.
– దేవహర్షిని, పదో తరగతి
ఆసక్తిగా పాల్గొన్నారు..
అందం, ఆరోగ్యంతో పాటు విజ్ఞానాన్ని పెంచేందుకు సైతం గోరింటాకు దోహదపడుతుందని గుర్తించాం. అందుకే గోరింటాకుతో విద్యార్థినుల చేతులపై పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు గీయించాం. ఈ విషయంలో పోటీలు నిర్వహించడంతో అంతా ఆసక్తిగా పాల్గొన్నారు.
– వి.సునీత,
గణిత ఉపాధ్యాయురాలు, ఖమ్మం
విద్యార్థుల్లో ఉత్సాహం...
మానవ అవయవాల బొమ్మల ఆధారంగా విద్యార్థులకు సైన్స్ పాఠాలు బోధిస్తాం. అయితే, బొమ్మలు ఎప్పటికీ గుర్తుండడం, అవి గీసేలా విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలని నిర్ణయించుకున్నాం. ఈక్రమంలోనే మెహందీతో వారి చేతులపై బొమ్మలు వేయించగా ఉత్సాహంగా ముందుకొచ్చి పోటాపోటీగా పాల్గొన్నారు.
– పి.ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు,
తిరుమలాయపాలెం జెడ్పీహెచ్‌ఎస్

ఇది కొత్తగా ఉంది...

ఇది కొత్తగా ఉంది...

ఇది కొత్తగా ఉంది...