
చికిత్సకు వచ్చే వారితో మర్యాదగా మెలగాలి
ఖమ్మంవైద్యవిభాగం: చికిత్స కోసం వచ్చే వారితో పాటు సహాయకులతో పట్ల గౌరవంగా మెలగాలని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పతి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ సూచించారు. ఆస్పత్రి పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందితో శనివారం సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడమే కాక సేవల్లో సహకారం అందించాలని తెలిపారు. అలాగే, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
హత్య కేసులో నిందితుడి రిమాండ్
తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంలో శెట్టి లక్ష్మీనారాయణపై దాడి చేసి ఆయన మరణానికి కారణమైన సుంకర శివను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈనెల 19న మధ్యాహ్నం ఇంటి స్థలం గెట్టు విషయంలో గొడవ జరగగా, లక్ష్మీనారాయణ తలపై శివ ఇనుప రాడ్‌తో కొట్టడడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు కాగా శనివారం శివను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు వైరా సీఐ సాగర్ తెలిపారు.