
భవిష్యత్ కోసమే పార్టీ మార్పు
వైరారూరల్: బీఆర్‌ఎస్ తనకు ఎలాంటి అన్యాయం చేయకపోగా తగిన గుర్తింపు ఇచ్చిందని మధిర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తెలిపారు. అయినా భవిష్యత్ కోసం పార్టీ మారాల్సి వస్తోందని చెప్పారు. ఆయన స్వగ్రామమైన వైరా మండలం కొండకొడిమలో శనివారం అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌లో 11ఏళ్ల పాటు గౌరవించడమే కాక రాష్ట్ర స్థాయి పదవితో సముచిత స్థానం కల్పించారని తెలిపారు. అయితే, అభివృద్ధి, భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోగా, అనుచరులతో సంప్రదిస్తున్నానని వెల్లడించారు. ఈ సమావేశంలో ధూళిపాల నాగేశ్వరరావు, కొప్పుల వెంకటేశ్వరరావు, దొంతెబోయినస్వామి, కస్తాల చిన్నసత్యనారాయణ, వాకదాని వెంకటేశ్వరరావు, దొంతెబోయిన వెంకటేశ్వరరావు, పగడవరపు నర్సింహారావు, పుట్ట వెంకటేశ్వరరావు, దారా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు