
రోడ్డు ప్రమాదంలో కారేపల్లి వాసి మృతి
కారేపల్లి: ఊరూరా తిరుగుతూ గ్యాస్‌స్టౌల మరమ్మతుతో కుటుంబాన్ని పోషించే వ్యక్తి రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.... కారేపల్లి మండలం మాధారం బుడిగ జంగాల కాలనీకి చెందిన తూరపాటి రాజు(32) ద్విచక్రవాహనంపై ఊరూరా తిరుగుతూ గ్యాస్‌స్టౌ రిపేర్ చేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. శనివారం కూడా అలాగే వెళ్లగా పాల్వంచ మండలం సోములగూడెం క్రాస్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు భార్య రమణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా, మా జీ సర్పంచ్ అజ్మీరా నరేష్‌నాయక్ తదితరులు నివాళులర్పించారు.
అదుపు తప్పి
ట్రాక్టర్ బోల్తా
నేలకొండపల్లి: పొలంలో దుక్కి దున్నేందుకు వెళ్తుండగా ట్రాక్టర్ ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్‌కు గాయాలయ్యా యి. మండలంలోని మంగాపురం తండాకు చెందిన ధీరావత్ కేశ్యా(40) దుక్కిదున్నేందుకు శనివా రం ట్రాక్టర్‌పై వెళ్తున్నాడు. అయి తే, మార్గమధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి సమీప పొలంలో బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్‌పై నుంచి కేశ్యా దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.