
రిజిస్ట్రేషన్ కోసం అంబులెన్స్‌లో...!
వైరా: కుమార్తె, మనవరాలిని పొలం రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించుకున్న ఓ వృద్ధుడు ఏకంగా అంబులెన్స్‌లో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. వైరా మండలం దాచాపురం గ్రామానికి చెందిన వనమా విశ్వనాధం వైరాలోని పోస్టాఫీస్ సెంటర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈమేరకు తన భార్య పేరిట దాచాపురంలో ఉన్న వ్యవసాయ భూమిని కూతురు మిట్టపల్లి నాగమణి, మనవరాలు శిల్ప పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు నిర్ణయించుకోగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయననును వైరా తహసీల్‌కు అంబులెన్స్‌లో తీసుకొచ్చా రు. దీంతో సిబ్బంది అంబులెన్స్‌లోనే విశ్వనాధం వేలిముద్రలు సేకరించి పంపించారు. ఒక్కసారిగా తహసీల్‌కు అంబులెన్స్ రావడంతో అంతా ఆశ్చర్యపోగా, ఆతర్వాత విషయం తెలియడంతో వృద్ధుడిని అభినందించారు.