బిడ్డల పుట్టినరోజు.. తండ్రి మృతి | - | Sakshi
Sakshi News home page

బిడ్డల పుట్టినరోజు.. తండ్రి మృతి

Jul 26 2025 8:50 AM | Updated on Jul 26 2025 9:28 AM

బిడ్డ

బిడ్డల పుట్టినరోజు.. తండ్రి మృతి

కూసుమంచి: కవల బిడ్డల పుట్టినరోజు ఘనంగా నిర్వహించాలని భావించి ఏర్పాట్లలో నిమగ్నమైన తండ్రి అదేరోజు కన్నుమూయడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. కూసుమంచికి చెందిన పుసులూరి యాదగిరి(38) ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల పాఠశాలలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బ్రెయిన్‌ స్ట్రోక్‌గా నిర్ధారించి చికిత్స చేస్తుండగా శుక్రవారం బ్రెయిన్‌డెడ్‌ కావడంతో మృతి చెందాడు. కాగా, యాదగిరికి ఆరేళ్ల వయస్సు ఉన్న కవల కుమార్తెలు ఉండగా శుక్రవారం వారి పుట్టినరోజు నిర్వహించేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే యాదగిరి మృతి చెందడంతో భారాబిడ్డలు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

గుర్తుతెలియని వ్యక్తి..

మధిర: మధిర రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి(45) మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మృతుడు ‘కారు గుర్తుకే ఓటు వేద్దాం, కందాలను గెలిపించుకుందాం’ నినాదం కలిగిన టీ షర్ట్‌ ధరించి ఉండగా ఇతర ఆధారాలేవీ లభించలేదని పేర్కొన్నారు. ఆయన ఎడమ మోకాలి నుంచి పాదం వరకు తెల్లటి బ్యాండేజ్‌ చుట్టి ఉందని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 98481 14202, 99636 41484 నంబర్లకు సంప్రదించాలని హెడ్‌ కానిస్టేబుల్‌ సూచించారు.

లైసెన్స్‌ లేకుండా తుపాకుల వినియోగం

కల్లూరు: కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురానికి చెందిన అనుమతి లేకుండా నాటు తుపాకులు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఘంటసాల లక్ష్మీనారాయణ, ఘంటసాల పెద్దిరాజు చెరువు వద్ద కాపలా ఉంటుండగా, ఆయుధ లైసెన్స్‌ లేకుండానే నాటు తుపాకులు, గన్‌ పౌడర్‌ ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో వీరిద్దరిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిత తెలిపారు.

రింగ్‌ సెంటర్‌లో లారీ భీభత్సం

పెనుబల్లి: మండలంలోని వీఎం.బంజర్‌ రింగ్‌ సెంటర్‌ మీదుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడంతో వాహనం అదుపు తప్పింది. సత్తుపల్లి వైపు నుంచి బొగ్గు లోడ్‌తో శుక్రవారం ఖమ్మం వైపు లారీ వెళ్తుండగా డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంతో రింగ్‌ సెంటర్‌ వద్ద అదుపుతప్పి బస్టాండ్‌ కాంప్లెక్స్‌ ఎదుట ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పగా ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటనాస్థలిని పరిశీలంచిన పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌వైర్‌ చోరీ

రఘునాథపాలెం: మండలంలోని ఈర్లపుడిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌ వైర్‌ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్లను కింద పడేసి అందులో నుంచి కాపర్‌ వైరు, ఆయిల్‌ చోరీ చేశారు. ఈమేరకు ఏఈ సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

బిడ్డల పుట్టినరోజు.. తండ్రి మృతి
1
1/1

బిడ్డల పుట్టినరోజు.. తండ్రి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement