
ఎడతెరిపిలేని వర్షం
తిరుమలాయపాలెం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి చేన్లలోకి నీరు చేరింది. తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు పెద్ద చెరువు, జూపెడ పెద్ద చెరువు, మూడుముక్కల కుంట, బచ్చోడు ఏనుగుల చెరువుల్లో సామర్‌ాధ్యనికి మించి నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. గతంలో భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీరు చేరగా, ఇప్పుడు వర్షాలతో వరద రావడంతో మిగతా చెరువులు కూడా అలుగు దశకు చేరుకున్నాయి. కాగా, పత్తి చేన్లలో నీరు నిలిచి కలుపు పెరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
●కామేపల్లి: మండల వ్యాప్తంగా శుక్రవారం కూడా వర్షం కొనసాగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కామేపల్లి పెద్ద చెరువు జలకళ సంతరించుకుని మత్తడి పోస్తోంది. మిగతా చెరువులు, కుంటల్లోకి సైతం నీరు చేరింది. ముచ్చర్ల గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేక లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.
●ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలోని డీజిల్ రూమ్(పారిశుద్ధ్య విభాగం) లో జలధార ఆగడం లేదు. కార్యాలయం ‘బీ’ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఈ గదిలో ఓ మూలగా కొన్ని నెలలుగా నీరు కారుతూనే ఉంది. తాజా వర్షంతో ధార మరింత పెరగగా.. సీలింగ్, స్లాబ్ కొద్దికొద్దిగా దెబ్బతింటున్నాయి.

ఎడతెరిపిలేని వర్షం

ఎడతెరిపిలేని వర్షం