
హామీలు అమలుచేయాల్సిందే...
ఖమ్మం మామిళ్లగూడెం: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు దివ్యాంగులకే కాక ఇతర చేయూత లబ్ధిదారులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఖమ్మం జెడ్పీ సెంటర్ నుండి టీఎన్జీవోస్ హాల్ వరకు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించగా, ఆతర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇవ్వడంతోపాటు వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికుల పింఛన్ పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్ ఆతర్వాత హామీని తుంగలో తొక్కిందని ఆరోపించారు. హామీల అమలు సాధ్యం కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆగస్టు 13న హైదరాబద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే మహాగర్జనకు జిల్లా నుంచి పెన్షన్‌దారులు అధికసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్) నాయకులు సామినేని భవానిచౌదరి, కందికట్ల విజయ్, కూచిపూడి సత్యం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణ