
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
కల్లూరురూరల్: కల్లూరు మండలం పెద్దకోరుకొండికి చెందిన కోమటి లాజరు(35) మే నెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన బైక్‌పై వెళ్తుండగా గేదె తగిలి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో కల్లూరు, ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా శనివా రం సాయంత్రం కనుమూశాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్టేషన్‌లో గుర్తుతెలియని
యాచకుడు..
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని యాచకుడు(65) శనివారం మృతి చెందాడు. అనారోగ్యంతో ఆయన మృతి చెందినట్లు భావిస్తుండగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించామని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87125 69499, 98481 14202 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
యాప్ నిర్వాహకుల వేధింపులతో ఆత్మహత్య
వేంసూరు: లోన్ యాప్‌లో అప్పు తీసుకున్న యువకుడిని నిర్వాహకులు వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తుపల్లి మండలం తుమ్మూరుకు చెందిన ముత్యాల హరీశ్ (25) వేంసూరు మండలం దుద్దెపూడిలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన యాప్ ద్వారా రూ.5,411 అప్పు తీసుకోగా, రూ.9 వేలు చెల్లించాలని నిర్వాహకులు బెదిరించారు. అంతేకాక ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫోన్ కాంటాక్టుల ఆధారంగా పలువురికి పంపించడంతో మనస్తాపానికి గురై గురువారం పురుగులమందు తాగాడు. ఆపై కుటుంబీకులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై హరీశ్ తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి