
సమస్యల పరిష్కారానికి పోరాడుదాం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళలపై నేటికీ వివక్షత కొనసాగుతున్నందున సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి సూచించారు. అన్నారు. ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ఖమమంలోని సుందరయ్య భవనంలో నిర్వహించగా ఆమె మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హింస పెరుగుతోందని, సనాతన ఆచారాల పేరుతో వంటింటికే పరిమితం చేస్తున్నారని తెలిపారు. అలాగే, మోడీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానన్న హామీ నెరవేరక మహిళలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారని చెప్కాపరు. ఈమేరకు బీజేపీ విధానాలను మహిళలు వ్యతిరేకించాలని సూచించారు. కాగా, ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, మహిళల వైద్యానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని, మహిళల సాధికారతకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న సీఎం, మంత్రులు ఎవరికీ ఉపాధి కల్పించకుండా హామీని ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. కాగా, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్న తీరు మార్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, నాగసులోచన, ప్రభావతి, కరుణ పాల్గొన్నారు.